Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవీయ కోణంలో స్పందించిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళలు, వృద్ధుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సోమవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తొంభై తొమ్మిదేండ్ల వృద్ధుడు, మాజీ సైనికోద్యోగి ఎన్.సత్య నారాయణ తమ చిన్న కుమారుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సీపీకి ఫిర్యాదు చేసేందుకు నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయానికి వెళ్లాడు. అయితే విషయం తెలుసు కున్న సీపీ స్వయంగా తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి వృద్ధుని నుంచి ఫిర్యాదును తీసుకున్నారు. తక్షణమే విచారణ జరిపి వారికి తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళలు, వృద్ధుల పట్ల అమానుషంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పోలీస్ స్టేషన్కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 9490617111కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి సత్వర న్యాయం చేస్తామనితెలిపారు. ఇదిలావుండగా సీపీ స్వయంగా ఫిర్యాదు తీసుకోవడం, వెంటనే స్పందించిన తీరుతో బాధితులే కాకుండా ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. బాధితులు ఎన్.సత్యనారాయణ సంతోషంతో సీపీ చేయి తీసుకుని ముద్దుపెట్టారు.