Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 16 నుంచి 21 వరకు బ్రహ్మౌత్సవాలు
- 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట శ్రీరామలింగేశ్వ రస్వామి ఆలయంలో మహశివరాత్రి సందర్భంగా ప్రతియేటా జరిగే జాతర బ్రహ్మౌత్సవాలకు ఆలయం ముస్తాబౌతుంది. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మౌత్సవాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో జాతర పరిసరా ప్రాంతాల్లో అధికారులు చురుకుగా పనులు కొనసాగిస్తున్నారు. గత బ్రహ్మౌత్సవాల్లో జరిగిన లోటుపాటులను సవరించు కుంటూ ఈసారి భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కీసరగుట్ట జాతరను విజయవంతం చేయడానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమెరుకుమార్, జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్ద్యా పలుమార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు సైతం నిర్వాహించారు.
జాతర పరసర ప్రాంతంలో చురుకుగా పనులు
కీసరగుట్ట జాతరకు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండరటంతో అధికారులు జాతర పరిసర ప్రాంతంలో చాలువ పందిళ్లు, స్ననాపు గదులు, మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, నిరంతర విద్యుత్, లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రం, క్యూలైన్, పార్కింగ్ కోసం స్దలాన్ని చదునుచేయడం వంటి పనులు చురుకుగా జరుగుతున్నాయి.
జాతరను విజయవంతం చేస్తాం
కీసరగుట్ట జాతరను విజయవంతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. కీసరగుట్ట ఆలయాకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్ర త్తలు తీసుకుంటున్నాం. భక్తుల కోసం ప్రసాదాలు, మంచీనీరు, మరుగుదొడ్లు, క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశాం.
ఆలయ చైర్మెన్ తటాకం రమేష్ శర్మ