Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు వర్సిటీ వీసీ కిషన్ రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జర్నలిస్టులు, ఆ కోర్సు చదివే విద్యార్థులు భాషపై పట్టు పెంచుకోవాలని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివ ర్సిటీ వైస్ ఛాన్స్లర్ కిషన్‌రావు అన్నారు. సమాజంపైనా అవగాహనతో ముందుకు పోవాలని సూచించారు. సోమవారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీల జర్నలి జం విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రావుతో పాటు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్, మాజీ రిజిస్ట్రార్ సత్తిరెడ్డి, ప్రొఫెసర్లు సుధీర్‌కుమార్, హసీనా అతిథులుగా హాజరై మాట్లాడారు. సీనియర్ల నుంచి జూనియర్ విద్యార్థులు సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు వర్సిటీ అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. జర్నలిజం వృత్తి పవిత్రమైనదనీ, దాని గొప్పతనాన్ని కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు ఎంసీజే సెకండియర్ చదువుతున్న సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ వేణుగోపాల్, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్లను సన్మానించారు. అలాగే జర్నలిజం స్టూడెంట్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ రావు, నవీన్, జక్కుల వెంకటేశ్, లవకుమార్, హబీబ్ ఖాద్రి, రాకేష్, అరవింద్, రాము, ప్రియాంక, జ్యోతి, రమణి, అనిల్ కుమార్, ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.