Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
అల్వాల్ సర్కిల్ పరిధిలో స్ట్రీట్ లైట్ రోజువారీ నిర్వహ ణకు పి.ధనుంజయ ప్రైవేట్ ఏజెన్సీ (సాయి కీర్తన ఎంటర్ప్రై జెస్) ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగలకు సక్రమంగా జీతాలు చెల్లించని సదరు స్ట్రీట్ లైట్ కాంట్రా క్టర్పై చర్యలు తీసుకోవాలని అల్వాల్ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లా డుతూ సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీలో అల్వాల్ సర్కిల్లోని 3 డివిజన్లు 3 చొప్పున మొత్తం 9మంది ఉద్యోగులకు ప్రతి నెలా సు మారు రూ.18వేల జీతంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కూడా ఇస్తానని చెప్పి సదరు కాంట్రాక్టర్ ఉద్యో గులను నియమించుకున్నట్టు తెలిపారు. కానీ సదురు కంట్రాక్టర్ ప్రతి నెలా సుమారు రూ.3వేలు జీతం నుంచి కట్ చేస్తూ కేవలం రూ.15వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగికీ ప్రతి నెలా జీతం రూ.18వేలతో పాటు పీఎఫ్ కేవలం రూ.9వేలు ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. ఈఎస్ఐ కింద వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ఉద్యోగులు ఈ సమస్య పై కాంట్రాక్టర్ను నిలదీ యడంతో సదురు కాంట్రాక్టర్ ఆగ్రహించి ఉద్యోగులను తొలగించారన్నారు. సదరు కాంట్రాక్టర్ పి.ధనుంజయ (సాయి కీర్తన ఎంటర్ప్రైజెస్) ప్రయివేటు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు, కాంట్రాక్టు ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టు ప్రారంభమైన నుంచి నేటి వరకు ఉద్యోగులకు రావల్సిన డబ్బులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అల్వాల్ సీనియర్ నాయకులు దండుగుల వెంకటేష్, నిమ్మ కృష్ణారెడ్డి, శేఖర్, కార్తీక్ గౌడ్, రవి కిరణ్, మల్లికార్జున గౌడ్, తూప్రాన్ లక్ష్మణ్, గోపి, ఎం.శ్రీనివాస్ రావు, అనిల్, నాగరాజు, ఆనంద్, రాజేష్, రవి, రామ్ సింగ్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.