Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విటరన్స్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మంగళవారం నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డిలను తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లకు అవసరమైన కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిరోజూ 65 మంది ఆటగాళ్లు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నారనీ, కొంతమంది టేబుల్ టెన్నిస్ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారనీ, వీరికి అవసరమైన రెండు ప్రాక్టీస్ హాల్స్‌ను ఏర్పాటు చేయాలనీ, సందర్శకులు, ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా అవసరమైన టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని విన్నవించు కున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ ఆటను యువతలో విస్త్రత ప్రచారం చేసి ఆటను మరింత ఎక్కువ మందికి చేరే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. డిప్యూటీ మేయర్ స్పందిస్తూ టేబుల్ టెన్నిస్ ఆటకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సదుపాయాలను కల్పిస్తాననీ, టాయిలెట్స్ కూడా ఏర్పాట అయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కాటన్ కృష్ణ, సెక్రెటరీ విట్టల్ బేతి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.