Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొ.కాశీం
నవతెలంగాణ-ఓయూ
మూడనమ్మకాలు, దేవదాసి, జోగినీ వ్యవస్థ లపై హైదరాబాద్ సంస్థానంలో మొట్ట మొదట పోరాడిన సామజిక యోధుడు భాగ్యరెడ్డి వర్మ అని ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొ.కాశీం అన్నారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భాగ్యోదయం పాఠం చెబుతూ కాశీం సార్ అన్నారు. స్వేఛ్ఛ జేఏసీ, ఓయూ విద్యార్థి సంఘాల నిర్వహించారు. గత సెప్టంబర్ నిజామాబాద్ లోని కోటగిరి టీచర్ మల్లికార్జున్ ఇదే పాఠాన్ని హై స్కూల్ లో బోధించి నందుకు, అందులో మూడ నమ్మకాల మీద విద్యార్థులకు వివరంగా చెప్పడాన్ని జీర్ణించుకోని కొందరు వీహెచ్పీ, బీజేపీ మూర్కులు దుండగులు దాడి చేశారన్నారు. అతని మీద దాడి చేసిన నేపథ్యంలో అదే పాఠాన్ని నేడు ఓయూలో బహింగంగా బోధించామని విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో 20వ శతాబ్దం ప్రారంభం వరకూ దళితులు హైదరాబాద్లో కూడా అంటరాని తనాన్ని పాటించడం చాలా మూర్కంగా వ్యవహరిస్తున్నారన్నారు. చదువులకు దూరం చేశారనీ, అందుకే వీరికి చదువులకు పాఠశాలలు లేక, ఉన్నవని అందుకే వారికి సొంతంగా భాగ్య రెడ్డి వర్మ ఏర్పాటు చేసి తోడ్పాటు నందించా డన్నారు. ఈ కార్యక్రమంలో స్వేఛ్ఛ జేఏసి నాయకులూ ఝాన్సీ, విజరు కుమార్, అధం రాజు, రషీద్ ద్రావిడ్, వహీద్, స్కై లాబ్ బాబు, శోభారాణి, ధనలక్ష్మి, అషుధ వేణు, ఓయూ విద్యార్థి సంఘాలు నాయకులు ఆర్.ఎల్ మూర్తి, రవి నాయక్, ఆంజనేయులు, సత్య, ఉదరు, అఖిల్, సుమంత్, రామటెంకి శ్రీను, ఆనంద్ శర్మ, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.