Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
నవతెలంగాణ-అడిక్మెట్
భారత రాజ్యాంగం భావి తరాల దిక్సూచి అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, మాస్టారు జి,సంఘ అధ్యక్షులు సుదర్శన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సంఘాన్ని ప్రజల కోసం నడిపించాలన్నారు. చిన్న చిన్న సంఘాలు ఏర్పాటు అవడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. భావి తరాల దిచ్సూచి భారత రాజ్యాంగం అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును దుర్వినియోగం చేయవద్దని సూచిం చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించి ఎన్నో పుస్తకాలు చదివి మనకు ఎంతో పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అలాంటి రాజ్యాంగంలో ఉన్న హక్కుల సాధన కోసం నిర్మొహమాటంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బస్తీలలో ఉండే పేద పిల్లలు పనికి కాదు బడికి వెళ్లాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్లు ఇంజినీర్లు కావాల్సిందిగా ఆకాంక్షించారు. ప్రతి తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను జ్ఞాన శిఖరాలను అధిరోహించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, పరంజ్యోతి, దాసరి రవీందర్ దాసరి రవీందర్, కురుమ మహేందర్, అశోక్, సెల్వరాజ్, యాదగిరి, శివశంకర్, దర్గా కరుణాకర్, బాబు, తదితరులు పాల్గొన్నారు.