Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
8 లక్షల మంది కాలేజీ గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థుల మిస్ చార్జీలు, 16 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే పెంచాలని రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్ లో విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు జీలపల్లి అంజి, పగిళ్ల సతీష్ అధ్యక్షతన 33 జిల్లాల విద్యార్థి సంఘం నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఐదేండ్ల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్షిప్లే నేటికీ కొనసాగి స్తున్నారన్నారు. నిత్యావసర ధరలు మూడు రెట్లు పెరిగా యనీ, ఇలా పెరగడంతో హాస్టల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని తెలిపా రు. హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దుర్మార్గం అన్నారు. సంబంధిత మంత్రులు, కమిషనర్లు ఒక్క రోజు కూడా హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సాధక బాధలు తెలుసుకో వడం లేదన్నారు. పోరాడకపోతే హాస్టళ్ల పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదన్నారు. ఉద్యోగుల జీతాలు రెండుసార్లు పెంచారనీ, ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు మూడు రెట్లు పెంచారు కానీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల మిస్ చార్జీలు, స్కాలర్ షిప్లు పెంచకుండా అన్యాయం చేస్తున్నా రన్నారు. రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒక్కదానికి కూడా సొంత భవనం లేదన్నారు. దొరల కార్లు తిరగడానికి ఫ్లైఓవర్లు, స్కై ఓవర్స్ను రూ.వేల కోట్లు వెచ్చించి కడుతుంటే చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే విద్యార్థుల హాస్ట్టల్లను బర్రెలదొడ్డి వలె ఉంచుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మిస్ చార్జీలను రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచాలనీ, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్చార్జీలను రూ.950 నుంచి రూ.2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు రూ. 3,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అనంతయ్య, తిరుపతయ్య, నిఖిల్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.