Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
భారతీయ జనతా పార్టీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా నడిగొప్ప శ్రీనివాస్ నాయీ నియమితులయ్యారు. ఆయనను జిల్లా అధ్యక్షుడు సలంద్రి శ్రీనివాస్ యాదవ్ నియమించారు. ఈ సందర్భంగా రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓబీసీలను చైతన్యం చేస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రామ్, రాంనగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.