Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో మిస్ హైనెస్ అందాల పోటీల కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని ఎఫ్ హౌజ్‌లో సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఉర్రూతలూగించింది. విభిన్నమైన వస్త్రాధారణతో ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలొలికించారు. అందచందా లతో చూపరులను ఆకట్టుకున్నారు. ఇప్పటిదాకా సినిమా, లైఫ్‌స్టైల్ ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంస్థగా పేరు సంపాదించుకున్న తాము, ఫ్యాషన్ రంగంలోకి అడుగిడుతున్నామని శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో దుబారు వేదికగా ఫైనల్స్ జరుగుతాయనీ దేశంలోని వివిధ నగరాలకు చెందిన మోడల్స్ ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌షోకు సంబంధించిన క్రౌన్‌ను లాంచ్ చేశారు.