Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన దివంగత సిరిపురం యాదయ్య జ్ఞాపకార్థం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లే గ్రౌండ్ కు వారి పేరును నామకరణం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి.పి.సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సుర్ణకంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, సుక్కా శివకుమార్, లిక్కి కృష్ణారెడ్డి, జలిగే శ్రీనివాస్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు జంగయ్యలు మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డిలకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామిడి రామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం మండలానికి నాగారం గ్రామానికి నికి చెందిన సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఎందరో ఆత్మ బలిదానాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నా మని.. సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానంకు గుర్తుగా ఈ ప్లే గ్రౌండ్ కు వారి పేరును నామకరణం చేయాలని వినతి పత్రం ఇచ్చి అభ్యర్థించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థననకు మేయర్ డిప్యూటీ మేయర్, కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు.