Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
స్వామి అనగానే ఏ సాధువో, సన్యాసి అనో అనుకుంటారని కానీ వివేకానంద సమాజాన్ని ప్రధానంగా యువత ను చైతన్య పరచి ప్రజలకు సేవ చేసే దిశగా స్ఫూర్తి నింపిన సామాజిక ప్రవక్త అని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శ్రీ త్యాగరాయ గాన సభ నిర్వహణలో కళా సుబ్బారావు కళా వేదిక పై జరుగుతున్న ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ.రమణ జన్మదిన సప్తాహంలో భాగంగా బండి రాజుల శంకర్ బృందం వివేకానంద బుర్ర కథను రసవత్తరంగా చెప్పారు. సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఆచార్య ఇనాక్ తో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ పాల్గొని శంకర్ రచించిన స్వామి వివేకానంద సూక్తి శత ను అవిష్కరించారు. దామోదర్ మాట్లాడుతూ రమణాచారి అందరికీ ఆప్తుడు, సహృద యంతో అధికారిగా ఉన్నప్పుడు ప్రస్తుతం సలహాదారుగా ప్రభుత్వం లోనూ ప్రజలకు సహాయం చేసే ఉన్నతుడు అని కొనియాడారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించిన సభ లో బండి శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.