Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
అసెంబ్లీ ముట్టడిలో భాగంగా తనను ముందస్తుగా అరెస్టు చేశారని వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుంజి సంతోష్ కుమార్ తెలిపారు. మంగళ వారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి సక్సెస్ మీట్లో ఆయనను ఆ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తమ్మి శెట్టి శివకష్ణ, బత్తుల ఉపేంద్రలు వీఆర్పిఎస్ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని గత ఏడాది తన ఆధ్వర్యంలో రెండుసార్లు అసెంబ్లీ ముట్టడి చేసి నట్టు చెప్పారు. వడ్డెరల విద్య ఉద్యోగ అభివద్ధి ధ్యేయంగా వీఆర్పీఎస్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మారుతి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.