Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపల్లోని ఆదిలాబాద్ రోడ్డులో శివాస్ బార్సు హాస్టల్లో నిర్వహిస్తున్న ఆక్యు ప్రెషర్ వైద్య శిబిరాన్ని ఈనెల 19 వరకు పొడిగిస్తున్నట్టు ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగరావు తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగించు కోవాలన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ఈ చికిత్సను ప్రతీ ఒక్కరు చేయించుకోవచ్చని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కాలేయ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు తదితర వ్యాధులను నయం చేసేందుకు డాక్టర్లు ఆక్యూ ప్రెషర్ చికిత్సను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ చికిత్సను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి మందులు లేకుండా ఆక్యు ప్రెషర్ మ్యాగెటిక్ వైబ్రేషన్ సుజోక్ చికిత్స విధానంలో వైద్యం వైద్యులు డాక్టర్ డీకే వైష్ణవ్ ద్వారా జరుగుతున్నట్టు తెలిపారు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100 చెల్లిస్తే వారం రోజులపాటు ప్రతీరోజు 15 నుంచి 20 నిమిషాలు చికిత్స అందిస్తామని చెప్పారు.