Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
విద్యార్థినులే విద్యలో కీలకమని సుల్తాన్ ఉల్ ఉలుం ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ జాఫర్ జావిద్ అన్నారు. పాతబస్తీ ప్రెసిడెన్సీ గర్ల్స్ హై స్కూల్ 25 వసంతాల వార్షికోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫలక్‌నుమాలోని పాఠశాల ఆవర ణలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారి విద్యార్థులు స్వాగతం పాటల నృత్యంతో అలరింపజేశారు. పాఠశాల విద్యార్థినులు పలు సాంస్కతిక కార్యక్రమాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యకు మొదటి గురువు తల్లియే ననీ, తల్లి పాత్ర కీలకమని అన్నారు. అబ్దుల్ ఖయ్యుం ఖాన్ 1997లో 80 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభిం చారన్నారు. ప్రస్తుతం 1100 మంది పైచిలుకు విద్యార్థినులతో పాఠశాలను దిగ్విజయంగా కొనసాగిస్తూ న్నారన్నారు. ఎందరికో ఉన్నత శిఖరాలకు అధిరోహింపజే శారన్నారని గుర్తు చేశారు. అతిథులుగా పాల్గొన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ వి.కె.స్వామి, సెయింట్ మార్క్స్ బార్సు టౌన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ కౌరెడ్డి, బి.వి.మిశ్రా మాట్లాడుతూ పాఠశాలలో ఉన్నత విద్యనందిస్తూ ఎందరినో తీర్చిదిద్దుతూ విద్యనంది ంచిన వ్యక్తులకు ఉంటుందనీ, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఎల్లప్పుడు గుర్తింపు విజయాలను సాధించా లన్నారు. తీగలకుంట కార్పొరేటర్ అన్నాన్తోపాటు టీచర్లు, విద్యార్థినులు, ఫర్వేజ్, సుల్తాన్ ఉల్-ఉలూం ఎడ్యూకేషన్ సొసైటీ సెక్రెటరీ డాఫర్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.