Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అణచివేతకు గురవుతుం డటంతో ఇంకా ఎన్ని రోజులు ఆంధ్ర పాలనలో ఉండాలనే ఉద్దేశంతో 2001లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ రాష్ట్ర సమితి ని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని తెలంగాణ దిక్సూచిగా చేశారని మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. రాష్ట్రంలో అమలవు తున్న సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయి అన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలతో బంగారు తెలంగాణ కల సాకారం అయ్యిం దన్నారు. దళిత బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు అని, దళిత బంధుతో దళితుల రూపురేఖలు మారిపోయాయి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏ మారుమూల చూసినా బీడులు బారిన భూమి ఉండదని, 2014 అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ, కాళేేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ లోని ఏ మారుమూలకుపోయినా, ఏ పల్లె చూసినా పచ్చటి పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివి ధంగా రైతుబంధును పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఎకరాకు పదివేల రూపాయ లను పెట్టుబడి సహాయం కింద అందజేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఒక గుంట భూమి ఉన్న రైతు ప్రమాదవశాత్తు మరణించినా ఐదు లక్షల రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నార న్నారు. వద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 3016 రూపాయలు ఎక్కడా లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ఆడపిల్లలు కన్నా కుటుంబాల్లో పెద్దమామగా నిలిచిన ఘనత కేసీఆర్‌కి దక్కిందన్నారు. దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాలను చూసి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందించి తెలంగాణ పథకాలు దేశం మొత్తం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని అన్ని పార్టీలు, ప్రజలు స్వాగతించాయి అని అన్నారు.