Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియాను అతి తక్కువ ధరకు టాటా సంస్థలకు అప్పచెప్పిన మోడీ టాటా కంపెనీ 250 విమానాలు ప్రాన్స్ కు సంబం ధించిన ఎయిర్ సంస్థ నుండి కొనుగోలు చేసే కార్యక్ర మంలో ప్రధాని మోడీ పాల్గొనడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు వి.ఎస్.బోస్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. వ్యాపారం చేయటం ప్రభుత్వ విధానం కాదనీ, ప్రైవేటు వారు చేస్తారని చెప్పిన దానికి నిదర్శనంగా ఉందన్నారు. ఒప్పంద కార్యక్రమంలో సాక్షిగా పాల్గొనడం జరిగిందా లేక వ్యాపారంలో భాగంగా పాల్గొనడం జరిగిందా అనేది మోడీ దేశ ప్రజలకు సమధానం చెప్పాలన్నారు. 17 ఏండ్లుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియాను ఎలాంటి కొత్త విమానాలు కొనకుండా, పెట్టుబ డులు ఇవ్వకుండా నష్టాలకు గురికావటానికి మోడీ విధానాలే ప్రధాన కారణమ న్నారు. ఈ ఒప్పందంలో టాటా కంపెనీ నుంచి ఇద్దరు పాల్గొనడం, ఫ్రాన్స్ దేశం నుంచి ఒక్కరు పాల్గొనడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానితో సహా ముగ్గురు మంత్రులు పాల్గొనడం, ప్రభుత్వ కార్పొరేట్ సంస్థల యెడల మోడీకి ఉన్న ప్రేమ, అభిమానం తేటతెల్లమవుతుందన్నారు. ఇలాంటి అనేక ఒప్పందాల్లో ఆదానీ వ్యాపారానికి లాభం చేకూరే విధంగా మోడీ గతంలో చేసిన కార్యక్రమాలు దేశం గమనిస్తుందనీ, ఆదానీ అక్రమ వ్యాపారం మూల ంగా దేశానికి జరిగిన ఆర్థిక నష్టం, పోయిన ప్రతిష్టపై నరేంద్ర మోడీ ఇప్పటి వరకు మాట్లాడకపోవటం విడ్డూరమన్నారు. మోడీ దేశానికి ప్రధాన మంత్రినా లేక కార్పొరేట్ సంస్థలకు ప్రధాన మంత్రినా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. 250 విమానాలు కొనుగోలు చేస్తున్న టాటా సంస్థలు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో, ఆ డబ్బు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో, ఏ బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటున్నారో, ఈ ఒప్పందం ప్రకారం టాటా గ్రూపు అప్పులు చెల్లించకపోతే ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమిటన్నది దేశ ప్రజలకు ప్రధాని స్పష్టంగా తెలియజేయవల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా దేశ ప్రధానిగా నరేంద్రమోడీ దేశానికి నష్టం జరిగే కార్పొరేట్ విధానాలను విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు.