Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
- బీసీ మంత్రి కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీసీల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.6,289 కోట్లు సరిపోవనీ, దీన్ని రూ.20వేల కోట్లకు పెంచాలనీ, ఈ రూ.6వేల కోట్లు రాష్ట్రంలోని 52 శాతం జనాభా గల బీసీలకు ఏ మూలన సరిపోవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు బడ్జెట్లో కేటాయిం పులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చాంబర్‌ను గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్‌తో కలిసి ముట్ట డించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే ఆర్ధిక సంవత్సరం గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెటులో బీసీలకు సంక్షేమానికి రూ.6,229 కోట్లు సరిపోవన్నారు. బడ్జెటులో కొత్త స్కీములు ఏమీ లేవన్నారు. పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్స్, మెస్ చార్జీలు పెంచే ప్రస్తావన లేదనీ, కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటా యింపులో లేదన్నారు. ఈ విద్యా సంవత్సరం కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయించలే దన్నారు. కార్పొరేషన్లో పెండింగ్‌లో ఉన్న 5 లక్షలా 47 వేల దరఖాస్తుదారులకు రుణాలు ఇవ్వడానికి కూడా ఈ బడ్జెటు సరిపోదనీ, బీసీ స్టడీ సర్కిల్‌కు కూడా ఈ బడ్జెట్ సరిపోదన్నారు.