Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వయం పాలనలో ఆత్మగౌరవంతో ముందుకెళ్తున్న రాష్ట్రం
- బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత
నవతెలంగాణ-ఓయూ
'సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల రారాజు అనీ, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. స్వయం పాలనలో రాష్ట్రం ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు తథ్యం' అని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా 'నవతెలంగాణ'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నవతెలంగాణ : సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉంది..?
డిప్యూటీ మేయర్ : సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది. రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ముందు వరుసలో నిలిచింది. దీనికి కారణం సీఎం కేసీఆర్ పాలనా నైపుణ్యమే.
నవతెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై మీ ఉద్దేశం?
డిప్యూటీ మేయర్ : సీఎం కేసీఆర్ 75 ఏండ్లలో ఏ రాష్ట్రం ప్రభుత్వమూ చేపట్టాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సుమారు 360 పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, వృద్ధాప్య పింఛన్ రూ.200 నుంచి రూ.2వేలకు పెంచి అమలు చేసినట్టు తెలిపారు. ఒంటరి మహిళల పింఛన్, రూ.5 భోజనం, గర్భిణులకు కేసీఆర్ కిట్, పౌష్టికాహారం, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించి బీడు భూములను సశ్యశ్యామలం చేస్తున్నారు. దళితబంధు, నగరంలో బస్తీ దవాఖానలు, డబుల్ బెడ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
నవతెలంగాణ : గ్రేటర్ అభివద్ధిలో సీఎం కేసీఆర్ కషి ఎలా ఉంది?
డిప్యూటీ మేయర్ : ప్రజల అవసరాలకు అనుగుణంగా 40 ప్లై ఓవర్స్ ఏర్పాటు చేసి 20 పూర్తి చేశారు. మరో 20 నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్జిలు, పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేశాం. బస్తీల్లో కమ్యూనిటి హాల్స్ ఏర్పాటు చేశాం. దూరదృష్టితో ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా డ్రైన్ బాక్స్ నిర్మాణం చేసి, పెద్ద నాలలకు రిటర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేసి, ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వరద ముప్పు నుంచి విముక్తి కల్పించారు. రోడ్డు విస్తరణ చేపట్టి, ప్రతి స్లమ్ సీసీ అండ్ బీటీ రోడ్స్ ఏర్పాటు చేశారు. నగర వాసులకు ఉచితంగా మంచినీరు ఇస్తున్నారు. సంస్కతి సంప్రదాయలకు చొరవ చూపిస్తున్నారు. రూ.వెయ్యి కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారు. కొండగట్టుకు కూడా రూ.100 కోట్ల నిధులు ఇచ్చారు.