Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సౌత్ జిల్లా నాయకులు పి.నాగేశ్వర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
జియాగూడ దుర్గానగర్ బస్తీలో కుర్చీల కార్కానాలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని సీపీఐ(ఎం) సౌత్ జిల్లా నాయకులు పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) సౌత్ జిల్లా నాయకులు అగ్ని ప్రమాదం సంభవించిన స్థలాన్ని గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గానగర్ బస్తీలో నిర్వహిస్తున్న కుర్చీల కార్కానా లో చెలరేగిన మంటలపై ఉన్నతాధికారులు విచారణ జరపాలన్నారు. ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్కనే నివాసం ఉంటున్న ప్రజలంతా ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ ఘటనలో 4 ఫైరింజన్లతో స్థానిక పోలీసులు, డీఅర్ఎఫ్ సిబ్బంది సహకారంతో 4 గంటలు శ్రమ పడిన మంటలను అదుపులోకి రాకపోవడం ఆందోళనకు గురయ్యారన్నారు. గురువారం ఉదయం వరకు కూడా పొగలు చెలరేగాయన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.