Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేకంగా 2వేల ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
- హైదరాబాద్‌లో టీఎంఏ దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వైద్యవిద్య మధ్యలో వదిలిపెట్టి వచ్చేసిన భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ కొనసాగించేందుకు వీలుగా, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ దేశంలో 2వేల మెడికల్ సీట్లను కేటాయించింది. ఉక్రెయిన్‌లో తమ మునుపటి చదువులను కోల్పోకుండా సరసమైన ఖర్చుతో 500 మంది మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, తాష్కెంట్ మెడికల్ అకాడమీ రెక్టార్ కలిసి.. ఎంహెచ్ఇఐ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతీయ ప్రతినిధి, డైరెక్టర్ నియో డాక్టర్ దివ్య రాజ్ సహాయంతో కాపాడారు. 1000 మంది విద్యార్థులను బుఖారా స్టేట్ మెడికల్ ఇన్ స్టిట్యూట్, 500 మంది విద్యార్థులను ఉజ్బెకిస్థాన్ లోని ఇతర సంస్థలు చేర్చుకున్నాయి. టీఎంఎ, బుఖారా అనేవి ఆధునిక మౌలిక సదుపాయాలు, అదనపు శిక్షణ కోసం భారతీయ, అంతర్జాతీయ ప్రొఫెసర్లతో కూడిన... అధునాతన మల్టీ-స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులు సైతం ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు. పరిమిత సీట్లు, అధిక ఫీజుల కారణంగా, భారతదేశానికి చెందిన మధ్యతరగతి విద్యార్థులు విదేశాలలో ఎంబీబీఎస్ చదువుతారు. కానీ, కొందరు మధ్యదళారులు విద్యార్థులను తప్పుదోవ పట్టించి, మోసం చేస్తున్నారు. దీన్ని నివారించడానికి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టీఎంఎ తన వ్యూహాత్మక భాగస్వామి నియో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తమ దక్షిణాసియా ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా.. పారదర్శకమైన, సత్వరసేవలతో నేరుగా ప్రవేశాలను అందించడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థుల ధైర్యాన్ని రెక్టార్ ప్రశంసించారు. సమాచారం, సేవలు నేరుగా పొందడానికి హైదరాబాద్‌లోని టీఎంఏ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు.
టీఎంఏ, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధి బందం నియో గ్రూపుతో మంత్రి హరీశ్‌రావును కలిసి, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారతీయ విద్యార్థులకు కేటాయించిన 2000 కోటాలో 500 మంది విద్యార్థులను టీఎంఏ, 1000 మందిని బుఖారా, మిగిలిన 500 మందిని ఇతర సంస్థలు చేర్చుకున్నాయని ఆయనకు చెప్పారు. భారతదేశానికి చెందిన తెలుగు విద్యార్థులు, ఇతర విద్యార్థుల క్షేమ సమాచారం గురించి అడిగిన మంత్రి.. వారిలో తెలివైన మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరారు. అలాగే విద్యార్థులు, వైద్యులు, చికిత్సల విషయంలో ఉజ్బెక్-తెలంగాణ ఉమ్మడి సహకారం గురించి కూడా చర్చించారు. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన చికిత్సను అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం వైద్య పర్యాటకానికి కూడా ప్రసిద్ధి చెందిందని మంత్రి వారికి తెలిపారు. తెలంగాణ విద్యార్థుల తరలింపులో డాక్టర్ దివ్య చేస్తున్న కషిని మంత్రి అభినందించారు. తెలంగాణ నుంచి అల్లోపతితో పాటు ఆయుష్ చికిత్సలనూ ఉబ్జెకిస్థాన్‌లో ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అందించాల్సిందిగా తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు.