Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూడూరు సొసైటీ చైర్మెన్ సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ- మేడ్చల్
రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పూడూరు సొసైటీ చైర్మెన్ ఎన్.సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం సొసైటీ 44వ సర్వసభ సమావేశం చైర్మెన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ లావుడియా శ్యామ్ లాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొదట రూ.25 వేల వరకు రుణ మాఫీ చేసిందని తరువాత రూ.25 నుంచి రూ.50 వేల లోపు ఉన్నవారికి మాఫీ వచ్చిందన్నారు. సొసైటీలో ఫ్రూట్స్, వెజిటేబుల్ క్లస్టర్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ వారి సహకారంతో నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఇది రైతులకి సువర్ణ అవకాశంగా మారనుందని సొసైటీ చైర్మెన్ నల్లబాపని సుధాకర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, మాజీద్ పూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రఘు,ఎండీ సూర్య నారాయణ, మాజీ సర్పంచ్ నర్సింహ రెడ్డి,మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.