Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హాన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఘనంగా గురువారం 11వ రోజు జరిగింది. కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని మాణిక్య నగర్, ద్వారకా నగర్ , మధుసూదన్ రెడ్డి నగర్, డీ నగర్, ఏఎంజి కాలనీ, ప్రతాప్ ఎస్టేట్స్, అంబేద్కర్ నగర్, చెరుకుపల్లి కాలనీలలో కాంగ్రెస్ జెండాను నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హాన్మంత్ రెడ్డి ఎగరేశారు. గడప గడపకు హాత్ సే హాత్ జో అభియాన్ స్టిక్కర్ వేసి, కరపత్రాలను పంచారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు అన్యాయం చేశారంటూ వివరిస్తూ... కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోసం చేసిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన అభివద్ధిని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. డీసీసీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ , ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజే జెమ్స్, ఆనంద్ రావు, ఏ బ్లాక్ సెక్రెటరీ బాలయ్య ,ఎక్స్ వార్డ్ నంబర్ ఎండీ జాకీర్, జేస్సి పాల్ , హాఫీజ్ , ఆగమయ్య , సిద్దయ్య ,ఈశ్వర్, బాలరాజు, మంగమ్మ, వనజ ,సాయి పాల్గొన్నారు.