Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు నిందితులు అరెస్టు
నవతెలంగాణ-హయత్నగర్
హెల్త్ పాలసీ పేరుతో భారీ మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం ముర్సీద్ అన్సారీ అలియాస్ ఏరియాన్, వికాస్ సింగ్, తరుణ్ శర్మ, మనీష్ తంగర్, లలిత్ కుమార్ వీరంతా ఘజియాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు. అందులో ముగ్గురు బీమా పాలసీ వ్యక్తులను ఎలా మోసం చేయాలో సిద్ధ హస్తులుగా ఉన్నారు. కొందరు నకిలీ కాల్ సెంటర్లో ఉత్తరప్రదేశ్లో పనిచేసేవారు. ఆ తరువాత సొంతంగా కాల్ సెంటర్ ప్రారంభించడానికి ప్రయిత్నించారు. ఇదిలా ఉండగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఈసీఐఎల్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి అయిన 2016లో పాలసీ చేయించుకున్నాడు. మొత్తం అతనితో పాటుగా 11మంది పేరిట పాలసీ చేసాడు. ఈ మేరకు ఉద్యోగి బ్యాంక్ లో అట్టి డబ్బులు కూడా వచ్చాయి. దాంతో అతని వివరాలు సేకరించిన సైబర్ నిందితులు దానికి సంబంధించిన రూ. 2కోట్లు, 5 కోట్ల రూపాయల చెక్కులు వచ్చాయని బాధితుడికి వాట్సప్ లో పంపారు. అందుకు సంబంధించిన డబ్బు విడుదల కావాలి అంటే రూ. 1.60కోట్లు జీ ఎస్ టీ చెల్లించాలని చప్పగా అతను అట్టి డబ్బును ఆన్లైన్ రూపంలో చెల్లించాడు. అట్టి విషయం బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియగా ప్రస్తుతం డబ్బు విషయంలో జరిగిన దంతా చీటింగ్ అని తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7ఫోన్లు,14సిమ్ కార్డులు,లాప్ టాప్,హార్డ్ డిస్క్,ఎస్ ఎస్ డీ కార్డ్,1 ,50,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.