Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తండ్రి శెనిగెల సాయిలును ఎమ్మెల్యే కేపీ వివేకానంద సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డిలు వారి నివాసం వద్ద కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి, మనోధైర్యాన్ని కోల్పోకుండా భరోసా ఇవ్వడం జరిగింది. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్, ప్రణయా ధనరాజ్ యాదవ్ ,సురేష్ రెడ్డి, గాజుల సుజాత, బాలాజీ నాయక్, శ్రీనివాస్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ , వెంగయ్య చౌదరీ , చంద్రగిరి సతీష్, శ్రీనివాస్ , ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ దండుగుల స్వామీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడి, మహేందర్ రెడ్డి, 14వ డివిజన్ అధ్యక్షుడు బొబ్బా శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.