Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని కృషి కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు విజయ్ భాస్కర్ షాపూర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ కారణంగా చికిత్స పొందుతు న్నాడు. ఈ మేరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుక్రవారం హాస్పిటల్‌కి వెళ్లి ఆయనను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విజయ్ భాస్కర్‌కు ఆందోళన చెందొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.