Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన పురస్కరించుకొని శుక్రవారం కుత్బుల్లాపూర్, గాజుల రామారం జంట సర్కిళ్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి జన్మదిన
శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ మగ్దూం నగర్‌లోని కార్పొరేటర్ కార్యాలయం ప్రాంగణంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. సంక్షేమ ఫలాల ప్రదాత, కారణజన్ముడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎ స్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు బింగి ఇందిరాగౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు పి.విట్టల్ ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సిహెచ్. దాసు, నాయకులు అప్పల శ్రీను, విట్టల్, నాయకులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన మేయర్
దుండిగల్ : బంగారు తెలంగాణ నిర్మాత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మ దినోత్సవం సందర్భంగా మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద శుక్రవారం మొక్కలను నాటి కేసీిఆర్కి హదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అద్భుత విజయాలను ముఖ్యమంత్రి పాలనలో సాధించడం జరిగింది. బంగారు తెలంగాణగా మార్చిన కేసిఆర్ ప్రభుత్వం, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో పట్టుసడలని ఉక్కుసంకల్పంతో ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా దేశాన్ని మార్చే శక్తి కేసీిఆర్కే సాధ్యమవుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ పద్మప్రసాద్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సబితా జలంధర్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, జనరల్ సెక్రెటరీ బట్ట మురళి, జాయింట్ సెక్రటరీ ఎల్ఐసి శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రెటరీ రమేష్, 12వ డివిజన్ బీఆర్ఎస్ అనుబంధ కమిటీల సభ్యులు చంద్రమౌళి, లడ్డు, సురేష్, రమేష్, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో
బాలానగర్ : బాలానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టినరోజు వేడుకలు కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహిం చారు. అనంతరం కేసీఆర్ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నూరేళ్ళు జీవించాలని కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యులు చందర్, డివిజన్‌కు సంబం ధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు బస్తీ, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఫతేనగర్ కార్పొరేటర్ పండాల ఆధ్వర్యంలో...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫతేనగర్ పరిధిలోని పైప్ లైన్ రోడ్ వద్ద జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ స్థానిక వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేసిఆర్ భవిషత్తు లో దేశానికి సారధ్యం వహించాలని, అదేవిధంగా ఆయన అయు ఆరోగ్యలతో ఉండాలని కోరారు. ఫతేనగర్ డివిజన్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శాసనమండలి విప్ శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో
దుండిగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శాసనమండలి విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌లోని (స్ఫూర్తి ఫౌండేషన్ స్కూల్) అనాధశ్రమం విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలను పంపిణీి చేసి విద్యార్థులందరికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో
కుత్బుల్లాపూర్ : సుభాష్ నగర్ 130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి కార్యాలయంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సుభాష్‌నగర్ 130 డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్లో పీపుల్స్ ఫస్ట్ అండ్ సెంటర్ వద్ద టీఎస్ సీపీడబ్ల్యూఏ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరము శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు డివిజన్ల అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.