Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్' పుస్తకావిష్కరణలో వామపక్ష విద్యార్థి,
యువజన సంఘాల నేతలు
- ' రెడ్ బుక్ డే' సందర్భంగా 21 నుంచి మార్చి 23 వరకు అధ్యయనం
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ ఆనందాచారి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాఠ్య పుస్తకాల్లో భగత్‌సింగ్ చరిత్రను లేకుండా చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయనీ, భగత్‌సింగ్‌కు మతాన్ని అంటగట్టెందుకు ప్రయత్నిస్తున్నారని వామపక్ష విద్యార్థి, యువ జన సంఘాల నేతలు పేర్కొన్నారు. వరల్డ్ రెడ్ బుక్ డే సంద ర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ సహచరులు శివవర్మ రాసిన 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్' పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (నవతెలంగాణ బుక్ హౌస్) వద్ద శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్‌బుక్ డే ప్రాధాన్యతను నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి వివరించారు. ప్రపంచంలోని అన్ని లెఫ్ట్ వరల్డ్ పబ్లిషింగ్ హౌస్‌లు, తెలంగాణలోని వామపక్ష పబ్లిషింగ్ హౌస్‌ల ఆధ్వర్యంలో 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్' పుస్తకాన్ని అందరూ చదివేలా కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ రెడ్ బుక్ అధ్యయన కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి భగత్‌సింగ్ వర్ధంతి మార్చి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముప్పు, ప్రమాదం, ఫాసిస్టు చర్యలు, రచయితలు, కవులు, కళాకా రులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రెడ్ బుక్ డే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రజల్లో స్పూర్తి, చైతన్యం నింపడానికి భగత్‌సింగ్ ఆశయాలు, ఆయన పోరాట చరిత్రను అధ్యయనం చేయించాలని సూచించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్ పాత్ర మరువలేదనీ, ఆయన చరిత్రను అధ్యయనం చేయడమే నిజమైన నివాళి అన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లావుద్దీన్ మాట్లాడుతూ భగత్‌సింగ్ స్వాతంత్య్రం కావాలని మాత్రమే పోరాడలేదనీ, సమసమాజం కోపం పోరాడు అన్నారు. భగత్‌సింగ్‌ను హిందూత్వశక్తులు హైజాక్ చేస్తున్నాయనీ, భగత్‌సింగ్ ఉరికి ముందు భగవద్గీతను అధ్యయనం చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అశాస్త్రీయ భావజాలాన్ని భగత్‌సింగ్‌కు అంటగట్టే చర్యలను వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆచరించిన విలువలు, ఆశయాలు, ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విద్యార్థులు, యువజనులు కృషి చేయాలన్నారు. భగత్‌సింగ్ స్పూర్తితో దోపిడీ, మతోన్మాదం, ఉన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ దేశంలో కాషాయీకరణ, దోపిడీ, అసమానతలు పెరిగిపోతున్నాయనీ, వీటన్నిటిపై పోరాటం చేయడమే భగత్‌సింగ్‌కు నిజమైన నివాళి అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న భగత్‌సింగ్, ఉద్యమకారుల చరిత్రను అణగదొక్కేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు. ఎలాంటి ఉద్యమంలో పాల్గొనని సావర్కర్, గాడ్సేల జయంతి, వర్ధంతులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం శోచనీయం అన్నారు. భగత్‌సింగ్ జయంతి, వర్ధంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు లెనిన్గువెరా, అశోక్‌రెడ్డి, నవతెలంగాణ పాఠ్య పుస్తకాల్లో భగత్‌సింగ్ చరిత్రను లేకుండా చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయనీ, భగత్‌సింగ్‌కు మతాన్ని అంటగట్టెందుకు ప్రయత్నిస్తున్నారని వామపక్ష విద్యార్థి, యువ జన సంఘాల నేతలు పేర్కొన్నారు. వరల్డ్ రెడ్ బుక్ డే సంద ర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్ మేనేజర్ డి.కిష్టారెడ్డి, సిబ్బంది రఘు, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.