Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధమాన నటి తారాదేవి
- సత్యసాయి నిగమాగమంలో ఆరంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయినిగమాగమంలో ఏర్పాటైన జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన-2023ని వర్ధ మాన నటి తారాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ, నేటికీ వాటిపై వన్నె తగ్గలేదన్నారు. నేటితరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. డిజైనర్లు సైతం దేశంలో చేనేతకా రులు నేస్తున్న ఈ హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను సృజనాత్మ కంగా డిజైన్ చేస్తున్నారని చెప్పారు. నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుంచి చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని వివరించారు. చేనేతను మరింత ఆదరించాల్సిన అవసరం ఉందనీ, పరోక్షంగా నేతకారులను ఆదుకున్న వారవుతామన్నారు.