Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
శాంతిని బోధించి మానవుని నిత్యజీవితంలో నిజమైన మార్గాలను ఏ విధంగా అనుసరించాలో తెలిపే బ్రహ్మకుమారిస్ ప్రతి ఏటా నిర్వహించే శివరాత్రి జ్యోతిర్లింగ అభిషేకానికి హాజరైన బీసీ కమిషన్ చైర్మెన్ వకులాభరణం మాట్లాడుతూ చెడు మార్గాన్ని విడనాడి మంచిని అనుసరించే మార్గాన్ని తెలిపే బ్రహ్మకుమారిస్ సంకల్పం గొప్పది అన్నారు. ఉపవాసాలు జాగారాలు సాంప్రదాయాలకు నిలువుటద్దమనీ, అయితే బ్రహ్మకుమా రిస్ ఉపవాసాలు జాగారాలతో మోక్షం లభించాలని దేవుని ధ్యానంతో పాటు ప్రజలకు సేవలు అందిస్తూ మంచి మార్గాన్ని ఏర్పటు చేసే కార్యక్రమంలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. రెండు రోజులు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమానికి జాతీయ నాయకు లతో పాటు బ్రహ్మకుమారిస్లోని రాధా బెహన్ పలువురు పోలీసు అధికారులు భాగస్వాములవుతారని తెలిపారు.