Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్మేటి అమరేందర్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ కార్యదర్శి ఎల్మేటి అమరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వెంకటాపూర్, జల్పల్లి మున్సిపల్లోని కొత్తపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆదివారం వైఏఆర్ గార్డెన్లో టీపీసీసీ కార్యదర్శి ఎల్మేటి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సుమారు వందమంది వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, మహిళలు చేరారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు మహేందర్, పాండు నాయక్, విజరు, శ్రీశైలం యాదవ్, దేవరాజ్, వెంకటేష్, కృష్ణ, యాదగిరి, రాజు, వినరు, భారతమ్మ, అంజమ్మ, శశికళ, మంజుల, లక్ష్మి,తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయం లో ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్ బామ్, వంగేటి మధు సూధన్ రెడ్డి, ఉమేష్, కిరణ్, ఆంజనేయులు, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.