Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్లు కె.లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం జల్పల్లి మున్సిపల్ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని శ్రీరాం కాలనీ 18,19 వార్డు కౌన్సిలర్లు కె.లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్లు అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో రూ.1కోటి 30లక్షల హెచ్ఎండిఏ నిధులతో ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి జంక్షన్ వరకు, జంక్షన్ నుంచి టీయూ ఎఫ్ఐడీసీి నిధులతో కెనరా బ్యాంక్ వరకు రూ.60లక్షల హెచ్ఎండిఎ నిధులతో నిర్మాణంలో ఉన్న సీసీి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. సీసీ, బీటీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ను కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథóంలో తీసుకెళ్తతున్నారని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే కార్గో రోడ్డుకు శ్రీరామ్ కాలనీకి రాకపోకలకు సులభమవుతుందని, ఎన్నో ఏళ్ల ప్రజల కల నెరవేరబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.