Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్నగర్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 3800 కిలో మీటర్లు పూర్తిచేసుకుంటే మహబూబాబాద్ పట్టణంలో అక్రమంగా అరెస్టు చేసి షర్మిలని హైదరాబాద్కు తరలిం చడం రాష్ట్ర ప్రభుత్వ నీతిమాలిన చర్య అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎల్బీనగర్ నియోజక వర్గం కోఆర్డినేటర్ మామిడి రామచందర్ అన్నారు. ఏర్పాటుచేసిన సమా వేశంలో మామిడి రామచంద్ర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ అవినీతిపైన ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల అరెస్టు అప్రజా స్వామికం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొడ శ్రావణ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కోట్ల వాసుదేవ్, జితేందర్, మల్లేష్ పాల్గొన్నారు.