Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజాస్వామ్యంలో ఉన్నమా..? రాచరిక పాలనలో ఉన్నామా..? అని ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్‌రెడ్డి అన్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్, వినయ్ భాస్కర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బంజారాహిల్స్ కాంగ్రెస్ నాయకులు గొల్యల రాజు అధ్వర్యంలో సీఎం కేసీఆర్, వినయ్ భాస్కర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రోహిన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రౌడీ రాజకీయాలు చేస్తోందన్నారు. ఏపీకే మాత్రమే పరిమితమైన ఫ్యాక్షన్ రాజకీయాలను తెలంగాణలో ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లిహిల్స్ డివిజన్ అధ్యక్షులు కటూరీ రమేష్, బ్లాక్ ప్రెసిడెంట్ సమీర్ కుర్బీ, నర్సింహ రెడ్డి, సిటీ ఉపాధ్యక్షులు ఫాజిల్ ముజ్జూ, తదితరులు పాల్గొన్నారు.