Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
హిమాయత్ నగర్ డివిజన్ తెలుగు అకాడమీ దగ్గర కొన్ని రోజులుగా డ్రయినేజీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే దానికి తోడు అక్కడున్న తాగునీటి పైపు పగిలి ఆ నీళ్లు కలవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి నుంచే జలమండలి జనరల్ మేనేజర్ రామకృష్ణకు ఫోన్ చేసి విషయం వివరించారు. రెండు రోజులలో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. లేని పక్షాన అక్కడే ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, బీజేపీ నాయకులు మహేష్, శేఖర్, ప్రవీణ్, పూజ, హితేష్, తదితరులు పాల్గొన్నారు.