Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రజాస్వామ్యంలో మైనార్టీల ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారనీ, దేశంలోని మైనారిటీల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గం అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ, ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు సయ్యిద్ అజీజ్ పాషా అన్నారు. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వమించారు. ఈ ధర్నాలో సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ మైనారిటీలు ఈ దేశంలో భాగమే అనీ, వారు ఈ దేశం కోసం, స్వేచ్ఛ కోసం అనేక త్యాగాలు చేసారని గుర్తు చేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మైనార్టీల బడ్జెట్లో 38 శాతం కోత విధించిందన్నారు. 'సబ్కా సాథ్ సబ్కా వికాస్' అనే మోడీ నినాదం ఇప్పుడు 'మైనారిటీస్ కా సత్య నాస్'గా కనబడుతుందన్నారు. మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్లు, మౌలానా ఆజాద్ షిప్ఆపేసి, ఇప్పుడు మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించ డం మైనారిటీలకు అణిచివేతకు గురిచేయడం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గాన్ని సమాన దృష్టితో చూడాలనీ, దేశంలోని ఇతర వర్గాలతో పాటు మైనారిటీ వర్గాల వారు కూడా అభివృద్ధి చెందేందు కు వీలుగా వారి సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలన్నారు. ఏండ్లుగా వివిధ అధికారిక కమిటీలు సిఫార్సు చేసిన విధంగా మైనారిటీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ దేశంపై మెజారిటీ ప్రజలకు ఉన్నంత హక్కు మైనారిటీ ప్రజలకు కూడా ఉందనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 23-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ పెంచి, రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మునీర్ పటేల్, నాయకులు షేక్ మహమూద్, షేక్ నదీమ్, మియా, ఫామీద బేగం, అన్వార్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.