Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తార్నాకలో డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి ఎంట మాలజీ విభాగ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అధికా రులతో మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడ కుండా ఎంటమాలజీ విభాగ సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణతోనే వ్యాధుల ను అరికట్టవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రతతో దోమలను అంతం చేయవచ్చని అని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలన్నారు. నాలా గుంతలు, చెరువులలోని సిల్ట్‌ను తొలగించి నిత్యం దోమల నివారణకు దోమల మందును పిచికారీ చేయాలన్నారు. అవసరమైన చోట దోమలను అరి కట్టడానికి డ్రోన్లు ద్వారా రసాయలను పిచుకారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, సూపర్వైజర్ యోనుస్, రాజశేఖర్, ఇతర ఇంటర్మాలజీ అధికారులు పాల్గొన్నారు.