Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనులను నాణ్యతతా ప్రమాణాలతో చేపట్టాలని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీలో జరుగుతున్న స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులను జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాం వాటర్ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. డివిజన్లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాల్లో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యమన్నారు. మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. హైదర్ నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాంట్రాక్టర్ గిరి, హైదర్‌నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, హైమద్ ఉన్నిస్సా, తదితరులు పాల్గొన్నారు.