Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్స్‌తోనే అభివృద్ధి, మనుగడ
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-ఓయూ
మహిళలు సైన్స్ రంగం, రీసెర్చ్‌లోకి రావాలని అప్పుడే అభివృద్ధి మానవ మనుగడ సాధ్యం అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఓయూ ఫిజిక్స్ విభాగం, విజ్ఞాన దర్శిని వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉమెన్ ఇన్ సైన్స్ సెమినార్లో వారు మాట్లాడా రు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఆర్మీ, ఐపిఎస్, నేవీ, డిఫెన్స్, డాక్టర్స్, ఆర్టిస్ట్స్, రాజకీయాలు లాంటి అనేక రంగాల్లో పని చేస్తున్నారు.. కానీ అనుకున్న స్థాయిలో సైన్స్ రంగంలోకి రావడం లేరనీ, కొన్ని సంస్థలు ముఖ్యంగా విజ్ఞాన దర్శిని రమేశ్ లాంటి వారి ప్రోత్సాహంతో కొంత వస్తున్నా గానీ చాలా తక్కువనే చెప్పాలన్నారు. కేవలం 14 శాతం మాత్రమే అమ్మాయిలు సైన్స్‌లో రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్నారనీ, అమ్మా యిలు సైన్స్ రంగం వైపు రాకపోవడం కారణం ఉద్యోగ ఉపాధి ఉండకపోవచ్చని కావచ్చు అన్నారు. ముఖ్యంగా తల్లి తండ్రుల ప్రోత్సాహం సైన్స్ వైపు తక్కువగా ఉంటుం దన్నారు. డిగ్రీ వరకు చదువులో బాగానే ఉన్నా ఆ తర్వాత కంటిన్యూ లేదనీ, ముఖ్యమైంది ఫ్యామిలీ డిస్కౌరేజ్ వల్ల కూడా ఉందన్నారు. పెళ్ళిళ్ళు త్వరగా కావడం కూడా ఒక మేజర్ ఎఫెక్ట్ అనీ, సైన్స్‌లో జీతాలు తక్కువగా ఉంటా యనీ, లైంగిక చిన్నచూపు లాంటి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంటే దాన్ని అమ్మాయిలు కూడా అందుకోవాలనీ, జాతీయ ఉమెన్ కౌన్సిల్ రీసెర్చ్ లో అమ్మాయిలు రీసెర్చ్ 20 శాతం లోపే ఉంటుందన్నారు. కొంత మంది మెర్సీ థోమస్ రీసెర్చ్ లో బాగా రాణించారు. ముంబై మురికి వాడలలో నుండి పుట్టుకొచ్చి నూక్లియర్ రీసెర్చ్ లో అద్భుత ప్రతిభ కనబరి చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైన్స్ ప్రోత్సాహానికి కిరణ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిందనీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు, క్యూరీ అనే రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించుకోవాలన్నారు. మహిళలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలన్నారు. ప్రజాకవి జయరాజ్ మాట్లాడుతూ ప్రకృతి సూత్రాలను అన్వేషించ డమే సైన్స్ అన్నారు. పర్యావరణ రక్షణ, ప్రకృతి పరిరక్షణ సైంటిస్టుల కర్తవ్యం కావాలన్నారు. విజ్ఞానదర్శిని అధ్యక్షు లు రమేశ్, సైంటిస్ట్ డా.స్వరాజ్, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.వీరన్న, డా.కరుణసాగర్, డా.హిమబిందు, డా.హమీ దా, విజ్ఞానదర్శిని కోశాధికారి తులసీరామ్ మాట్లాడారు. ఆనంతరం మిరాకిల్ ఎక్స్పోజర్ సైన్స్ షో చేయగా విద్యా ర్ధులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సెమినార్లో టీపీటీఎ ల్‌ఎఫ్ విజయ్ కుమార్, విజ్ఞానదర్శిని నాయకులు శోభ, విష్ణు, మహేష్ పాల్గొన్నారు.