Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
దళిత బంధు నిధులు రూ.17,700 వేల కోట్లను వెంటనే విడుదల చేసి, లబ్దిదారులను గుర్తించి, వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం, మహా ఎమ్మార్పీఎస్ తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ, మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యపాగ నరసింహారావు మాదిగ, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ హాజరై మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో 2022-23లో కేటాయించిన బడ్జెట్లో దళిత బంధు నిధులు రూ.17,700 కోట్లు లబ్ధిదారులను వెంటనే గుర్తించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో దళితులు 16 లక్షల కుటుంబాలు ఉన్నాయ న్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేయాలని భావించిందనీ, అందులో భాగంగా రాష్ట్రంలో లక్షా 70 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నా ఆచరణలో ముందుకెళ్లడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,70,000 మందికి, నియోజకవర్గానికి 1500 మందికి గ్రామానికి 30 మందికి చొప్పున దళిత బంధు పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి దళితబంధు నిధులు విడుదల చేయాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు లాలయ్య, ఉపాధ్యక్షుడు శేఖర్, గజ్జల సూర్యనారాయణ, సరస్వతి, రాంచందర్, జంగయ్య, గోపాల్, గువ్వల లక్ష్మన్, రాష్ట్ర అధ్యక్షుడు విజయ లక్ష్మీ, గొండ మహేందర్, రత్నం శ్రీనివాస్, సుధాకర్, విద్యాసాగర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.