Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివద్ధి పనులలో ఎలాంటి నాణ్యత లోపా లు లేకుండా పూర్తి చెయ్యాలని కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 15,16 డివిజన్లలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పనులలో ఎక్కడ కూడా నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. అదేవిధంగా బీటీ రోడ్డు నిర్మాణం ఉన్నందున నల్లా కనెక్షన్లు లేని ఇండ్లకు డమ్మీ కనెక్షన్లు ఇచ్చేలా అధికారులు సిద్ధం చేయాలని అన్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో రోడ్డును పదే పదే తవ్వే అవసరం ఉండదని అన్నారు. అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని కాలనీలను గుర్తించి వెంటనే ఎస్టీమెట్ సిద్ధం చెయ్యాలని సూచించారు.
అనంతరం రూ.7కోట్ల నిధులతో చేపడుతున్న సమీకత మార్కెట్ పనులను డీఈఈ శారదతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యతలో ఏ మాత్రం తేడా లేకుండా చూడాలని ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడే మార్కెట్ పటిష్టంగా ఉండేలా పనులు జరగాలని సూచించారు. తదుపరి పక్కనే ఉన్న డంపింగ్ యార్డు యందు చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ జాన్పాల్ రెడ్డిని ఆదేశించారు. చెత్త తరలింపులో ఎటువంటి సమస్యలు రానీయకుండా జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమలో వాటర్ బోర్డు డీజీఎం నిర్మల, మేనేజర్ మమత ,మున్సిపల్ సిబ్బంది సతీష్, రాజేష్ పాల్గొన్నారు.