Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రఘునందన్ రావు
నవతెలంగాణ-బడంగ్పేట్
సమాజంలో ప్రతి ఒక్కరు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సిం హారెడ్డిలు అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధి లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని జీఎంఆర్ గార్డెన్స్‌లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నీిషియన్ యూనియన్ వారి 3వ వార్షికోత్సవ మహాసభ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి,మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారం చేయటంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. ధనార్జనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలన సాగుతుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండి పడ్డారు. కార్మికులకు ఈఎస్ఐ, ఫి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు రూ.50లక్షల ఎక్స్గ్రేషిియా చెలించాలని డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భూమిలేని పేద ప్రజలకు భూములను పంపిణీ చేయటం జరిగిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల భూములను లాక్కొని వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసమతి పెరిగిందని, రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఎలెక్ట్రికల్, టెక్నీషియన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మలేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,నాయకులు నిరంజన్, బెనర్జీ, ఉదయ్ కుమార్, పాష, బాల్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.