Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
గుండె పోటుతో వార్డ్ ఆఫీసర్ మృతి చెందిన సంఘటన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ వార్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సూరారం రతన్ కుమార్(32) మంగళవారం గుండెపోటుతో మరణించారు. సోమవారం నాడు కొద్దిగా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చెకప్ చేయించుకొగా గుండెకు సంబంధించిన ఈసీజీ చేయించడంతో కొద్దిగా సమస్య ఉందని వెంటనే టూడీకో చేయించాలని వైద్యులు సూచించగా వెంటనే పరీక్షలు చేయించారు. మంగళవారం నాడు మరోసారి పరీక్షలకు రావాలని సూచించారు. దీంతో మంగళవారం నాడు ఉదయం పూట విధులకు హజరైన రతన్ కుమార్ 11 గంటలకు ఇంటికి వెళ్ళి ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పీర్జాదిగూడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కార్పొరేషన్ నుండి ఆర్ధిక సహాయం
కార్పొరేషన్లో వార్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రతన్‌కుమార్ హఠాన్మరణం చాలా బాధాకరమై విషయమని కమిషనర్ డాక్టర్ ఆర్.రామకృష్ణారావు అన్నారు. రతన్ కుమార్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సహాయం కింద రూ.20వేలు కుటంబ సభ్యులకు అందించారు. పరామర్శించిన వారిలో మేనేజర్ జ్యోతి, డీఈఈ శ్రీనివాస్, ఉద్యోగులు ఉన్నారు.