Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఏసీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని బేగంపేట్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ జీ.శంకర్ రాజు అన్నారు. మంగళవారం పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో రోడ్డుభద్రతా, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. ప్రతీ ఒక్క వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రాంగ్ రూట్లో వెళ్లొద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. రెడ్ సిగల్ దాటొద్దన్నారు. స్టాప్లైన్కు ముందే వాహనాలు నిలుపాలని చెప్పారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమని సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ టీటీఐ ఇన్స్పెక్టర్ జీ.నాగరాజు, ఎస్ఐ సీహెచ్ జ్యోతి, హెడ్‌కానిస్టేబుల్ పద్మావతి, ప్రిన్సిపాల్ రూపేందర్ సింగ్, హేమచందర్, పీటీ పవన్‌కుమార్‌తోపాటు దాదాపు 300 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.