Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కళ్లెం నవజీవన్
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గత నెల 28వ తేదీన డివిజన్లో పలు భూగర్భ డ్రైనేజీ ప్రనులను ప్రారంభించారు. ప్రారంభించిన మరుసటి రోజు నుండి ఇప్పటివరకు కూడా పనులు జరగకపోవడంతో అధికారుల నిర్లక్ష్యమా, మరి అధికార పార్టీ నేతలు ఎవరైనా అధికార బలంతో అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారా అని జలమండలి అధికారి జనరల్ మేనేజర్ వినోద్‌ని ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి విన్నవించారు. తాను చేస్తున్న అభివృద్ధి పనులకు ఓర్వలేక, ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న తనపై టీిఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు వచ్చే విధంగా ఇలా అభివృద్ధి పనులకు అడ్డంపడుతూ డివిజన్ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కావున మరో రెండు రోజుల్లో ఇన్ఫర్మేషన్, పలు కాలనీలలో ప్రారంభించిన పనులను మొదలు పెట్టాలని, లేనిచో జలమండలి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.