Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకులు పట్టించుకోరు అధికారులు స్పందించరు
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ సర్కిల్ పరిధిలో అధికారుల సమన్వయ లోపం ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రజా సమస్యలు విన్నవించిన తమ పరిధికాదంటూ ఇంజనీరింగ్ అధికారులు తమకు సంబంధం లేదంటూ వాటర్ బోర్డ్ అధికారుల సమన్వయ లోపం ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని కాలనీవాసులు వాపోతున్నారు చిల్కానగర్ డివిజన్ పరిధిలోని బీరప్పగడ్డ ప్రాంతంలో గత పది రోజులుగా వాటర్ పైప్లైన్ పగిలి నీరు వధాగా పోతున్నా, మంచినీటి పైప్ లైన్లో డ్రైనేజీ నీరు కలుషితమవుతున్న కాలనీవాసులు ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సమస్యను మాత్రం పరిష్కరించకుం డా సమస్యను మరింత జఠలం చేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నా అధికారుల మాత్రం స్పందన లేకపో వడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు.
సమస్యలు పరిష్కరించని అధికారులు ఎందుకు : పెద్ద స్వామి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని, ప్రభుత్వం చెబుతుంటే ఉప్పల్ సర్కిల్ పరిధిలోని అధికారులు మాత్రం, ప్రజలు సమస్యలు పరిష్కరించాలని, కాళ్ళు అరిగేలా తిరిగినా, ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.