Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రెడ్ బుక్ డే సందర్భంగా మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఓయూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో భగత్ సింగ్ బుక్‌ని పఠన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు టి. మహేందర్ మాట్లాడుతూ 1948 ఫిబ్రవరి 21న కారల్ మార్క్స, హెంగెల్స్ మొదటి సారిగా కమ్యూనిస్ట్ ప్రణాళి కను ఆవిష్కరించిన రోజు అనీ, ఆనాటి నుంచి నేటి వరకు ప్రపంచంలో అనేక మార్పులకు దారితీసిన పరిస్థితులు మనకు తెలుసు అన్నారు. దాని వల్ల సమాజంలో అసమానతలకు గురువుతున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయన్నారు. అనేక మందిని ప్రభావితం చేశాయి అన్నారు. దానితో కాపిటల్ గ్రంధం రాసినట్టు తెలిపారు. తరతరాలుగా దోపిడీకి గురవుతున్న పీడితులకు ఆయుధంగా మారిందన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి గురి అవుతున్న పెట్టుబడి దారి దేశాలు మార్క్స్ కాపిటల్ ను చదివి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నారన్నారు. నేటికీ మార్క్స్ కాపిటల్ సమ సమాజ మార్పుకు దిక్సూచి అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ సీతారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, సహాయ కార్యదర్శి శివ, పాష, వెంకట్, రాజు పాల్గొన్నారు.