Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాశ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు. ప్రస్తుతం రోజు రోజుకూ తెలుగు భాష తీవ్ర అసమానతలకు గురవుతుందనీ, అమ్మ భాష తెలుగును మరిస్తే అమ్మను మరిచినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ భాషా దినోత్స వాన్ని పురస్కరించుకుని తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్యార్టర్స్ లో 'లాంగ్వేజ్ ప్రొఫెషన్ ఎక్సలెన్సీ అవార్డు-2023'ను బండా ప్రకాష్‌కు ప్రధానం చేసి ఆయనను శాలువా, మెమెంటోతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్సా అని నాడు శ్రీకృష్ణదేవరాయులు కొనియా డారని గుర్తు చేశారు. విదేశాలలో సైతం మన మాతృభాష తెలుగును అభ్యసిస్తున్నారనీ, కానీ తెలుగు రాష్ట్రాలలో ఆంగ్లంపై మక్కువ చూపించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ మాట్లాడుతూ అందరం కలిసి తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ అడ్మిషన్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ మహ్మద్ అక్తర్ అలీ, ప్రొఫెసర్లు దయానంద్ ఆర్య, మాయాదేవి, అబ్ధుల్ మొయిద్, ప్రేమ్ చంద్, ప్రశాంత్, రాధారి రామ్మోహన్, డా.గుండ్లవల్లి శ్రీనివాస్, ప్రదీప్, సుచరిత చౌహన్, అల్లుడు జగన్, తదితరులు పాల్గొన్నారు.