Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకర్లను కోరిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ పథకాల అమలులో లబ్దిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణవితరణ చేసి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బ్యాంకర్లను కోరారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో డీసీసీ/డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు నామినేట్ చేసిన బాధ్యత గల అధికారులు డీసీసీ మీటి ంగులకు పూర్తి వివరాలతో హాజరు కావాలనీ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదే అన్నారు. లక్ష్యాలను సాధించకపోవడానికి గల కారణాలను బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు. వివిధ బ్యాంకులలో సంక్షేమ శాఖలను చెందినవి గ్రౌండింగ్‌లో పెండింగ్‌లో ఉన్న యూనిట్లకు వెంటనే పూర్తి చేయాలనీ, గ్రౌండింగ్ పూర్తయిన యూని ట్లకు యూసీలు వెంటనే ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశిం చారు. గ్రౌండింగ్ కానీ యూనిట్లకు త్వరగా పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న యూనిట్లను లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాల న్నారు. ఎల్డీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ లో 2022-23లో సంవత్సరానికి కేటాయించిన రూ.212 73.40 కోట్లకుగాను డిసెంబర్ 2022 నాటికి 46,413. 74 కోట్లు అంటే 183 శాతం సాధించ గా.. ప్రయారిటీ సెక్టార్లో రూ.25413.74 కోట్లకుగాను రూ.46,705. 51కోట్లు అంటే 184 శాతం సాధించామ న్నారు. అనంతరం నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాబార్డ్ అధికారి ప్రవీణ్ కుమార్, ఏజీఎం అనిల్ కల్బొడే, ఆర్బీఐ జీఎం పవన్‌కుమార్, డీఐసీ, బ్యాంకర్లు పాల్గొన్నారు.