Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగునీటి సమస్యతో డివిజన్ ప్రజలు అల్లాడుతుంటే అధికారులకు పట్టడం లేదు
- హాత్ సే హాత్ జోడో యాత్రలో టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్ర్రేష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్
ముంపు ప్రాంతాల ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గాను 110 కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా మూసీ కాల్వకు అనుసంధానం చేస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రాజెక్టు పనులు కూడా ఎందాకా వచ్చాయో మంత్రి మల్లారెడ్డి సమాధానం చెప్పాలని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం నాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6,18 డివిజన్లలో ఇంటింటికీి కాంగ్రెస్ యాత్రను నిర్వహించారు. అనంతరం వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలపై మంత్రి మల్లారెడ్డి ఏనాడూ అసెంబ్లీలో లేవనెత్తిన పాపాన పోలేదని అన్నారు. గతేడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఅర్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చిందంటే బోడుప్పల్‌లోని ముంపు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారని, సాక్షాత్తు కేటీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు ఏడాదైనా ముందుకు సాగలేదని విమర్శించారు.
స్వరాష్ట్ర అభివద్ధి - నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరడం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం
కార్పొరేటర్ అజయ్ యాదవ్
గత తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తోటకూర అజరు యాదవ్ అన్నారు. టీపీసీసీి ఆదేశాల మేరకు చేపట్టిన హాత్ సే హాత్ అనంతరం కార్పొరేటర్ తోటకూర అజరు యాదవ్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అప్పులే మిగిలాయని, అభివద్ధి ఏమాత్రం లేదన్నారు. అమరవీరుల త్యాగాలు - స్వరాష్ట్ర అభివద్ధి - నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్‌గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బొమ్మక్ కల్యాణ్, మధుసూదన్ రెడ్డి, రాపోలు శంకరయ్య, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ గుప్త, పోగుల దిలీప్‌రెడ్డి, హరినాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోటకూర రాజు యాదవ్, సింగిరెడ్డి రాజు రెడ్డి, మేకల యాదగిరి, కాంగ్రెస్ రాపోలు రామస్వామి, మైసగళ్ల రాజు, చీరాల జంగయ్య, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుకూరి నవీన్, అశోక్ నగర్ కాలనీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, విశ్వం గుప్త, ఎ.రాములు, బీరప్ప, రామగళ్ల చంటి తదితరులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.